Siddipet ACB Raid: రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త

Siddipet ACB Raid
Siddipet ACB Raid

డ్రైనేజీ పైప్‌లైన్ తొలగింపుకు లంచం డిమాండ్.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఏసీబీ దాడి

Siddipet ACB Raid

ది డిజిటల్ బ్రీఫ్ 

సిద్దిపేట, మే 12, 2026:

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం ప్రకారం.. ఓ ఇంటి స్థలంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రైనేజీ పైప్‌లైన్ ఉండటంతో దానిని తొలగించాలని ఫిర్యాదుదారుడు గ్రామ పంచాయతీ కార్యదర్శిని, అలాగే సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులను సంప్రదించాడు. అయితే పైప్‌లైన్ తొలగించాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో విసిగిపోయిన ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న నగదు, సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనతో కొమురవెల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది. చిన్న చిన్న పనులకే ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *