
BNS 64(2)(M) సెక్షన్ జత చేసిన పోలీసులు.. నేరం రుజువైతే జీవిత ఖైదు అవకాశం
Bandi Bhageerath POCSO Case
ది డిజిటల్ బ్రీఫ్
హైదరాబాద్, మే 18, 2026:
బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్‌ను నమోదు చేసినట్లు సమాచారం. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(M) సెక్షన్‌ను కేసులో జత చేసినట్లు తెలుస్తోంది.
ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పోక్సో సెక్షన్ల కింద నమోదైన కేసులో ఈ కొత్త సెక్షన్ చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా శనివారం రాత్రి లొంగిపోయిన బండి భగీరథ్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. బాధితురాలి వాంగ్మూలం, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
భగీరథ్ చెప్పిన వివరాలు, బాధితురాలి వాంగ్మూలంలోని అంశాలను పరిశీలించిన అనంతరం అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో భగీరథ్ స్నేహితుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో అక్కడే ఉన్నారని, ఘటన అనంతరం రాజీ ప్రయత్నాలు చేశారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో 10 మంది పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో భగీరథ్ స్నేహితులను కూడా పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఎవరు అక్కడ ఉన్నారు, తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. SIT విచారణ, కోర్టు పరిణామాలు, రాజకీయ ఆరోపణల మధ్య ఇప్పుడు కొత్త సెక్షన్ నమోదు కావడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
గమనిక: ఈ కేసులో నమోదైన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయి. సంబంధిత వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదు.
Also read the బోరు గుంతలో పడిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లిన తాత మృతి
Also read the పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
for more info visit PIB, Election commission



