తెలంగాణలో అత్యధిక క్రైమ్ రేట్ — పోలీసు వ్యవస్థపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణలో అత్యధిక క్రైమ్ రేట్
తెలంగాణలో అత్యధిక క్రైమ్ రేట్

ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో దోషులను పట్టుకోలేకపోతున్న పోలీసులు — కేంద్ర నివేదికలో తెలంగాణకు అగ్రస్థానం

తెలంగాణలో అత్యధిక క్రైమ్ రేట్

ది డిజిటల్ బ్రీఫ్

హైదరాబాద్, మే 9, 2026:

తెలంగాణలో పెరుగుతున్న నేరాలపై BRS నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన దోషులను ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోవడం తీవ్రంగా ఖండించారు. దోషులను పట్టుకోవడానికి బదులు సీపీ జాగ్రత్తగా ఉండాలని స్టేట్‌మెంట్ ఇస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.

పట్టపగలు కరీంనగర్ నడిబొడ్డున బంగారం దోపిడీ, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులపై దాడులు జరిగినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పిన BRS నేత క్రిశాంక్‌పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 20 రోజులు జైలులో వేశారని హరీష్ రావు ఆరోపించారు.

దేశంలో అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలో ఉందని కేంద్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించిందని హరీష్ రావు గుర్తు చేశారు. BRS నేతలపై రాజకీయ వేధింపులు కొనసాగిస్తూ నేరస్థులను వదిలేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *