
రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో జెండా గద్దెల నిర్మాణానికి పిలుపు.. జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించాలని సూచన
TRS Flag Platform Model
ది డిజిటల్ బ్రీఫ్
హైదరాబాద్, మే 18, 2026:
Kalvakuntla Kavitha నేతృత్వంలోని Telangana Rakshana Sena కీలక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె మోడల్‌ను కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కవిత.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు. పార్టీ గుర్తింపు, ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
జెండా గద్దెల నిర్మాణానికి ప్రత్యేక నమూనాను కూడా పార్టీ ప్రకటించింది. గద్దెలను మూడు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో నిర్మించాలని సూచించారు. గద్దె బేస్ భాగాన్ని గ్రీన్ కలర్‌లో, పైభాగాన్ని ఎల్లో రంగులో రూపొందించాలని పేర్కొన్నారు. మధ్యలో బ్లూ కలర్ తెలంగాణ మ్యాప్‌తో పాటు TRS గుర్తు ఉండేలా నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ నమూనాను అనుసరించాలని కవిత సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒకే డిజైన్‌తో జెండా గద్దెలు నిర్మించడం ద్వారా పార్టీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు.
అదేవిధంగా ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా “జెండా పండుగ” నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాలు, పార్టీ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో జెండా గద్దెలను ఏర్పాటు చేసి పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ వేదికగా తెలంగాణ రక్షణ సేన తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ శక్తిని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also read the బోరు గుంతలో పడిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లిన తాత మృతి
Also read the పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
for more info visit PIB, Election commission



