TGEAPCET Topper Rushi: టీజీఈఏపీసెట్ టాపర్ రుషి కలను నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి

TGEAPCET Topper Rushi

స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన రుషిని ప్రత్యేకంగా సత్కరించిన చిరంజీవి.. ల్యాప్‌టాప్ బహుమతిగా అందజేత

TGEAPCET Topper Rushi

ది డిజిటల్ బ్రీఫ్ 

హైదరాబాద్, మే 20, 2026:

Chiranjeevi మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. TGEAPCETలో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా పిలిపించి సత్కరించారు. రుషి అద్భుత విజయాన్ని అభినందిస్తూ ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు.

రుషి తండ్రి గతంలో “స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే చిరంజీవిని కలిపిస్తా” అని తన కూతురికి మాట ఇచ్చినట్లు సమాచారం. కూతురు కష్టపడి చదివి అద్భుత ఫలితం సాధించడంతో తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అనంతరం రుషిని మెగాస్టార్ చిరంజీవిని కలిపించారు.

ఈ సందర్భంగా రుషిని శాలువాతో సత్కరించిన చిరంజీవి.. ఆమె కృషి, పట్టుదలను ప్రశంసించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, కష్టపడి సాధించాలని ప్రోత్సహించారు.

రుషి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చిరంజీవి ఆమెకు ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సందర్భంగా రుషి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ప్రోత్సాహం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తూ చిరంజీవి తీసుకున్న ఈ చర్య ఎంతో ప్రేరణాత్మకమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

టీజీఈఏపీసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన రుషికి ఇప్పుడు మెగాస్టార్ ఆశీస్సులు కూడా దక్కడం విశేషంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *